ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏప్రిల్ 24న జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి (సంస్థ) అశోక్ కౌల్ ఒక ప్రకటనలో తెలిపారు. కాశ్మీరీ పండిట్ వేడుకలో కౌల్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏప్రిల్ 24, జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం నాడు, సాంబాలో స్థానిక సంస్థల ప్రతినిధుల సదస్సులో ప్రధాని ప్రసంగిస్తారు. ప్రధాని , కాశ్మీరీ పండిట్ సంఘం ప్రతినిధుల మధ్య సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్టికల్ 370 .. 35A రద్దు చేయబడిన తర్వాత మోడీ జమ్ము కశ్మీర్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెలాఖరున జమ్మూ కాశ్మీర్‌లో పర్యటిస్తారని బీజేపీ అధికారి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement