Friday, November 22, 2024

Breaking : బైజూస్ తో ఏపీ ప్ర‌భుత్వం ఒప్పందం – నా జీవితంలో అత్యంత ముఖ్య‌మైన రోజు-సీఎం జ‌గ‌న్

బైజూస్ తో ఏపీ ప్ర‌భుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు బైజూస్ కంటెంట్ ఉండనుంది. అలాగే 4-10త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు బైజూస్ కంటెంట్ ఉండ‌నుంద‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీస్ నుండి ఆయ‌న మాట్లాడారు. త‌న జీవితంలో నేడు అత్యంత ముఖ్య‌మైన రోజ‌ని జ‌గ‌న్ తెలిపారు..వ‌చ్చే ఏడాది నుంచి బైజూస్ కంటెంట్ తో పుస్త‌కాలు రానున్నాయ‌ని చెప్పారు. చర్చల ఫలితంగా.. ఇవాళ బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఇప్పటివరకూ కొందరికే పరిమితమైన ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ విద్య ఇకపై ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రానుంది. ఏడాదికి కనీసం రూ.20వేల నుంచి రూ.24వేలు చెల్లిస్తేకాని ‘బైజూస్‌’ ఇ– తరగతులు విద్యార్థులకు అందుబాలోకి రావు. అలాంటి నాణ్యమైన విద్య ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. పేదరికం అన్నది నాణ్యమైన చదువులకు అడ్డం కాకూడదనే సంకల్పంతో వైఎస్‌ .జగన్‌ సర్కార్‌ ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.క్లాస్ ల‌లో టీవీల ద్వారా బైజూస్ కంటెంట్ పాఠాలు రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement