సినిమా టిక్కెట్ల వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. ఇద్దరు హీరోలను టార్గెట్ చేసేందుకే ఇలా చేస్తున్నారా అని నిలదీశారు. ఓ ప్రొడక్ట్ ని ఎంతకు అమ్మాలనేది తయారీదారుడి ఇష్టమన్నారు. కొనాలా వద్దా అనేది వినియోగదారుడి ఇష్టమని వర్మ తెలిపారు. హీరోల రెమ్యునరేషన్ కూడా సినిమా బడ్జెట్ లో భాగమేనన్నారు.
ఆ హీరోల కోసమే ప్రేక్షకులు సినిమాకి వస్తారని తెలిపారు. లగ్జరీ థియేటర్ కు , రేకుల షెడ్డుకు ఒకే రేటా అన్నారు. ఇదేం లాజిక్ అంటూ వర్మ ప్రశ్నించారు. లగ్జరీ హోటల్ ఇడ్లీకి, కాకా హోటల్ ఇడ్లీకి తేడా లేదా అని నిలదీశారు. సినిమా ఆడకపోతే నష్టపోయేది నిర్మాతలేనని వర్మ తెలిపారు.