బిజెపి పార్టీ ముఖ్య నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఏపీలో బీజేపీ బలోపేతంపై చర్చ జరిపారు. వైసీపీ,టీడీపీలకు సమాన దూరం పాటించాలని అమిత్ షా తెలిపారు. జనసేనతో కలిసి అధికారాన్ని సాధించేందుకు ప్రణాళిక రూపొందించారని అమిత్ షా పార్టీ నేతలకి సూచనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ విభజన బిల్లు అంశాలపై అమిత్ షాతో చర్చించాం అన్నారు బిజెపి మహిళా నేత పురంధ్రీశ్వరి. విభజన బిల్లులోని 80శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చిందని పురంధ్రీశ్వరి అన్నారు. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదన్నారు. దీనిపై కూడా పోరాటం చేస్తామన్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు.
Breaking : ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాం..పురంధ్రీశ్వరి..
Advertisement
తాజా వార్తలు
Advertisement