Tuesday, November 26, 2024

Breaking : చ‌రిత్ర‌లో క‌లిసిపోనున్న అమ‌ర్ జ‌వాన్ జ్యోతి – అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన రాహుల్ గాంధీ


వార్ మెమోరియ‌ల్ లో అమ‌ర్ జ‌వాన్ జ్యోతి విలీనం చేశారు. మ‌ధ్యాహ్నం మూడున్న‌ర‌కు విలీన కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. కాగా వార్ మెమోరియ‌ల్ లో విలీనంపై రాహుల్ గాంధీ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దేశ‌భ‌క్తి , వీరుల త్యాగాన్ని అర్థం చేసుకోలేర‌న్నారు రాహుల్ గాంధీ. నేటితో చ‌రిత్ర‌లో అమ‌ర్ జ‌వాన్ జ్యోతి క‌లిసిపోనుంది. ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 50 సంవత్సరాల తర్వాత అమర జవాన్ జ్యోతినీ ఆర్పి వేయాలని తాజాగా మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇండియా గేట్ వద్ద ఉండే ఈ జ్యోతిని ఇవాళ… ఆర్పివేయనున్నారు. అమర జవాన్ జ్యోతి ని శాశ్వతంగా అవును మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే ఈ జ్యోతిని తీసుకెళ్లి జాతీయ యుద్ధ స్మారకం వద్ద జ్యోతి లో కలిపేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అమర్ జవాన్ జ్యోతి ని… యుద్ధ స్మారక జ్యోతిలో కలపనున్నారు. రెండు జ్యోతులను నిర్వహించడం కష్టంగా ఉన్న కారణంగానే… ఈ రెండిటినీ కలిపేయాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 1971 సంవత్సరంలో ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల జ్ఞాపకార్థం అమర్ జవాన్ జ్యోతి ఏర్పాటు చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1972 సంవత్సరంలో అమర్ జవాన్ జ్యోతి ని ప్రారంభించారు. 2019లో జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement