టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం అఖండ సినిమా నిర్మాతలందరినీ సంతోషానికి గురిచేసింది. దర్శకులు, సినీ ప్రముఖులు బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి తగ్గలేదనే నమ్మకంతో సంబరాలు చేసుకుంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నందమూరి బాలకృష్ణకు మరోసారి మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అనే సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఒక డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు బాలయ్య. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత బాలకృష్ణ చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. జై సింహా ఎన్టీఆర్ బయోపిక్, రూలర్, సినిమలు అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాయి.
అయితే.. డిజాస్టర్ ఎదుర్కొంటున్న ప్రతి సారి బోయపాటి చేసిన సినిమాతోనే భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు బాలయ్య. ప్రపంచానికి మీరు ప్రశ్న అయితే నాకు సమాధానం అంటూ బోయపాటి మూడోసారి కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందించాడు. సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి బూస్ట్ ఇచ్చాయి. మళ్లీ ఏడేళ్ల తర్వాత వచ్చిన అఖండ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ఇక వెండితెరపై ఈ సినిమాను చూసిన అభిమానులు జై బాలయ్య అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మాస్ థియేటర్స్ లోనే కాకుండా బిగ్ సెంటర్స్ లో నూ బాలయ్య అభిమానులు అస్సలు తగ్గడం లేదు. అయితే నెల రోజుల వ్యవధిలోనే డిస్ని హాట్ స్టార్ లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2022 కొత్త సంవత్సరం కానుకగా సినిమాను హాట్ స్టార్ లో విడుదల చేసే చాన్స్ ఉంది. త్వరలోనే ఈ విడుదలపై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నారు.