అగ్రిగోల్డ్,అక్షయ గోల్డ్ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసులను ఏలూరు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది హైకోర్టు. వేలం ద్వారా వచ్చిన రూ.50కోట్లు జిల్లా కోర్టుకు బదిలీ కానున్నాయి. గత ఏడు సంవత్సరాలుగా హైకోర్టులో అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ వివాదాలు కొనసాగుతున్నాయి. విచారణ కొనసాగించాలని డిపాజిటర్ల, బ్యాంకుల అభ్యర్థన తిరస్కరణ. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం ఏలూరు కోర్టుకే విచారణ అధికారం ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది.దాంతో అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులపై హైకోర్టులో విచారణ ముగిసింది.
Breaking : హైకోర్టులో ముగిసిన అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసు విచారణ – ఏలూరు కోర్టుకి బదిలీ
Advertisement
తాజా వార్తలు
Advertisement