అలయన్స్ విమానం ఇంజన్ కవర్ లేకుండానే ముంబై నుంచి భుజ్ కి టేకాఫ్ అయ్యింది. విమానంలో 70మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో పెద్ద ముప్పే తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు అంతా. ముంబై నుంచి బయలుదేరిన అలయన్స్ ఎయిర్ ATR 72-600 విమానంలో నలుగురు సిబ్బంది, ఒక ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ఉన్నారు. ఈ ఘటనకు కారణమేంటని ఏవియేషన్ వాచ్‌డాగ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అది ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తోంది.
అలయన్స్ ఎయిర్ ATR 72-600 కు ఇలాంటి ఘటన ఎదురుకావడానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని విమానయాన నిపుణుడు కెప్టెన్ అమిత్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ విమానానికి నాలుగేళ్ల వయస్సు ఉందని చెప్పారు. దీనిని సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే ఇలా జరిగిందని అన్నారు. విమానం టేకాఫ్ కాగానే ఇంజిన్ కవర్ (కౌలింగ్) కిందపడిపోయిందని అధికారులు తెలిపారు. ఇంజిన్ కౌలింగ్ కోల్పోవడం వల్ల గమ్యస్థానానికి వెళ్లే విమానంపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని DGCA అధికారులు మీడియాతో తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..