మిగిలిని ఆహారం తిని 40మంది అస్వస్థతకి గురయ్యారు..ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి చనిపోగా అంత్యక్రియల తరువాత భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం మిగిలిన ఆహారాన్ని తిన్న 40 మంది అస్వస్థతకు గురయ్యారు. సోమవారం అధికారులు ఈ విషయం తెలిపారు. వారందరూ ఫుడ్ పాయిజనింగ్ వంటి లక్షణాలతో బాధపడుతు రని సూరజ్‌పూర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సిఎంహెచ్ఓ) డాక్టర్ ఆర్ఎస్ సింగ్ తెలిపారు. అస్వస్థతకు గురవ్వడంతో వారందరినీ సూరజ్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే, వారంతా ప్రమాదంనుంచి ఇప్పుడు బయటపడ్డారని వైద్యులు చెప్పారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement