గొడవ పడితే మన కాళ్లు మనమే నరుక్కున్నట్లు అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. కులం,మతం పేరుతో గొడవలు జరిగితే ఎవరూరారన్నారు. మతం,కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. అన్ని కులాలు,మతాలను ఆదరించే దేశం మనదని తెలిపారు. శాంతి,సామరస్యం లా అండ్ ఆర్డర్ బాగుంటే పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయన్నారు. గుజరాత్ లో రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు కేసీఆర్. పసికూన తెలంగాణలో 24గంటలు కరెంటు, సాగునీరు పుష్కలంగా ఉందన్నారు. దుష్టశక్తుల బారి నుండి రాష్ట్రాన్ని కాపాడుతామన్నారు. భవిష్యత్ లో విద్య,వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం అన్నారు.
Breaking : పసికూన తెలంగాణలో 24గంటలు కరెంటు..పుష్కలంగా నీరు – సీఎం కేసీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement