అతి వేగంతో ప్రయాణించిన బస్తు అదుపుతప్పి లోయలో పడింది. దాంతో నాలుగేళ్ల చిన్నారితో సహా 20మంది దుర్మరణం చెందారు. కాగా ఈ ఘటనలో మరో 30మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఉత్తరపెరూలోని లిబర్టాడ్ రీజియన్ లో చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పెరూ అధికారులు తెలిపారు. తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెళ్తున్న బస్సు లిబర్టాడ్ రీజియన్‌లో అదుపుతప్పి లోయలో పడిపోయింది. వంద మీటర్ల లోతులో పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. కాగా అధ్వాన్నమైన రోడ్లు, అతి వేగం, ప్రమాద సూచికలు లేకపోవడం, అధికారులు నిబంధనలను అమలు చేయక పోవడం వల్ల పెరూలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..