Saturday, November 23, 2024

Breaking: తెలంగాణ‌కు 12 స్వ‌చ్ఛ అవార్డులు.. మంత్రి కేటీఆర్ హ‌ర్షం..

స్వచ్ఛ భారత్‌ మిషన్‌లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడంపై మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అలాగే కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల కెటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ పలు అంశాంలపై మాట్లాడారు.

ఏడున్న‌ర సంవ‌త్స‌రాలుగా తెలంగాణ అన్నిరంగాల్లో పురోగ‌మిస్తోంద‌న్నారు. వివిధ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తూ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు మంత్రి కేటీఆర్‌. ప‌ట్ట‌ణాలు అభివృద్ధి చెందాల‌నే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప‌ట్ట‌ణాభివృద్ధిలో స‌మూల‌మైన మార్పులు తీసుకువ‌చ్చారని స్ప‌ష్టం చేశారు. మున్సిపాలిటీల సంఖ్యను 68 నుంచి 142కు పెంచామని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఇండియాలోనే ఎక్క‌డా లేని విధంగా గ్రీన్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టి.. హ‌రిత ప‌ట్ట‌ణాల‌ను త‌యారు చేస్తున్నామ‌న్నారు కేటీఆర్‌. ఏ రాష్ట్రం కూడా అమ‌లు చేయ‌ని విధంగా టీఎస్ బీపాస్ చ‌ట్టాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని, ఇప్ప‌టి దాకా తీసుకొచ్చిన చ‌ట్టాల‌న్నీ పౌరుడి కేంద్రంగా తీసుకువ‌చ్చామ‌న్నారు కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వ కార్య‌క్ర‌మాల‌కు వివిధ సంద‌ర్భాల్లో కేంద్రం గుర్తింపు ఇచ్చిందని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్‌. తాజాగా శానిటేష‌న్ ఛాలెంజ్‌లో భాగంగా 4,300 సిటీలు, టౌన్స్‌ పోటీ ప‌డితే తెలంగాణ‌కు 12 పైచిలుకు అవార్డులు వ‌చ్చాయన్నారు. ఈ అవార్డులు రావడాన్ని ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి ల‌భించిన గుర్తింపుగా భావిస్తున్నామని పేర్కొన్నారు కేటీఆర్‌. కాగా, ఈ నెల‌ 20న విజ్ఞాన భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోబోతున్నామని చెప్పారు. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వానికి, అధికారుల‌కు గ‌ర్వ‌కార‌ణమని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement