Friday, November 22, 2024

పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్.. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్ ఎంతంటే?

రెండు మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఇవ్వాల (సోమ‌వారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై.. 24 క్యారెట్ల ధరపై కూడా ఎలాంటి మార్పులు లేవు. మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 61,400గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఎలాంటి మార్పు లేదు.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,050 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,330గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 47,050.. 24 క్యారెట్ల ధర రూ. 51,330గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,330 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,900 ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో మాత్రం రూ.61,400లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement