కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను మూసివేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని పలు చోట్ల వర్షం, నవయుగ సొరంగం చుట్టూ మంచు కారణంగా కొండచరియలు విరిగిపడి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసినట్లు అధికారులుతెలిపారు.కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిపై అడ్డంకులు ఏర్పడినట్లు జమ్మూ, కాశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలకు హైవేను మూసివేయాల్సి వచ్చింది. ఎన్‌హెచ్‌డబ్ల్యూపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల పెద్ద పెద్ద రాతి బండలు రహదరిపై పడ్డాయి.
జమ్మూ కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలకు కలిపే ఏకైక జాతీయ రహదారి ఖాజీగుండ్-జమ్మూ-శ్రీనగర్ రహదారి. హైవేపై వివిధ చోట్ల కొండచరియలు విరిగిపడటం, పర్వతాల నుండి రాతి శకలాలు పడటం వల్ల హైవేని మూసివేశారు. హైవేలోని బనిహాల్-ఖాజిగుండ్ సెక్టార్‌లో రాత్రంతా భారీగా మంచు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాంబన్ జిల్లాలోని రొంపాడి-బనిహాల్, షాల్‌ఘర్-వాగన్, మౌంపాసి-రామ్‌సౌ, పాంటియల్, డిగ్‌డోల్, మరుగ్, మంకీ మోడ్, కెఫెటేరియా బెండ్ ,మహర్‌లలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..