భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్ ని ఇవ్వాల మరోసారి విజయవంతంగా పరీక్షించారు. అరేబియా సముద్రంలో మోహరించిన కోల్ కతా శ్రేణి యుద్ధనౌక నుంచి గాల్లోకి దూసుకెళ్లిన బ్రహ్మోస్ ఆశించిన ఫలితాలను ఇచ్చిందని భారత నేవీ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.
ఈ పరీక్షలో బ్రహ్మోస్ క్షిపణికి దేశీయంగా అభివృద్ధి చేసిన సీకర్, బూస్టర్ ను అమర్చారు. దీని పనితీరును ఈ సందర్భంగా పరిశీలించారు. సీకర్, బూస్టర్ కలయికతో బ్రహ్మోస్ సత్తా మరింత పెరుగుతుందని నేవీ వర్గాలు తెలిపాయి. తాజా వెర్షన్ ను సముద్రతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేలా డిజైన్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.