Tuesday, November 19, 2024

Breaking: బాలుడి కిడ్నాప్ అవాస్తవం.. తల్లిని వదిలి బడికి పోలేకే ఈ డ్రామా..

నిన్న తనను కొంతమంది కిడ్నాప్​ చేసి హనుమకొండకు కారులో తీసుకెళ్లారని ఓ బాలుడు చెప్పిన విషయం అంతా అబద్ధమని, బడికి పోలేక తాను ఇలా కిడ్నాప్​ డ్రామా క్రియేట్​ చేశాడని పోలీసులు ఇవ్వాల అసలు వాస్తవం వెల్లడించారు. ములుగు జిల్లా జాకారంలో ఉన్న సోషల్​ వెల్ఫేర్​ స్కూల్​లో చదువుతున్న విద్యార్థి ప్రేమ్​సాగర్​ ఇలా కావాలనే కిడ్నాప్​ అయినట్టు చెప్పాడని, అబ్బాయి తల్లి సునంద కంప్లెయింట్​తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు రేగొండ ఎస్​ఐ తెలిపారు. తాము పరిశీలించిన వివరాల మేరకు, సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు ట్రేస్​ చేశామని, ఎక్కడా కిడ్నాప్​ అయినట్టు రికార్డు కాలేదన్నారు. అయితే ఇదంతా కావాలనే అతను చెప్పినట్టు తెలిసిందన్నారు. దీనికి సంబంధించి ఎస్​ఐ తెలిపిన వివరాలు..

నిన్న ఉదయం అబ్బాయి తల్లి హాస్టల్​కు వెళ్లమని చెప్పి, టిఫిన్​ తిని రమ్మని డబ్బులు ఇచ్చింది. దీంతో ఆ విద్యార్థి నడుచుకుంటూ పెట్రోల్​ బంక్​ ముందు వరకు వెళ్లాడు. ఆ తర్వాత పరకాల బస్సు ఎక్కి అక్కడి బస్​ స్టేషన్​లో దిగాడు. అంతేకాకుండా ఆ అబ్బాయితోపాటు వెంకటేశ్వర్లపల్లికి చెందిన ఐటీఐ కాలేజీ స్టూడెంట్​ రవితేజ కూడా అదే బస్సులో జర్నీ చేశాడు. రవితేజ ఈ అబ్బాయిని ఒక్కడివే ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగాడు. దాంతో ఈ అబ్బాయి రవితేజతో పరకాలలో తాతయ్య హాస్పిటల్ లో ఉన్నాడు. అమ్మ అక్కడే ఉందని చెప్పాడు. తర్వాత ఈ అబ్బాయి పరకాలలో బస్ దిగిన తర్వాత టాటా మ్యాజిక్ వాహనంలో హన్మకొండకి వెళ్లాడు. తన అక్క దగ్గరకు వెళదాం అనుకున్నాడు.

కానీ, అడ్రస్ మర్చిపోయాడు. దాంతో అక్కడే ఒక కొబ్బరి తాడు తీసుకొని తన చేతులు కట్టమని అటుగా వెళ్తున్న ఒక స్కూల్ పిల్లానికి తాడు ఇచ్చి చేతులు వెనక్కి కట్టించుకున్నాడు. తర్వాత అక్కడ కూర్చుని ఏడుస్తున్న క్రమంలో sk. పాషా అనే ఒక మెకానిక్ గమనించాడు. ఈ అబ్బాయిని వివరాలు కనుక్కోగా అతని తల్లి నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇలా చేస్తే ఇక్కడ అమ్మ, అన్నయ్య కొడతారేమో అని, కిడ్నాప్ అనే విషయం చెప్తే స్కూల్ కి వెళ్లడం ఉండదని అబద్ధం చెప్పాడు. ఈ విషయాలని అతని అన్నయ్య సురేష్ తో ఈ అబ్బాయి చెప్పడం జరిగింది. ఈ అబ్బాయిని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. ఉదయం 6 నుండి 9 వరకు ఈ దారిలో అతను చెప్పిన విధంగా అలాంటి omni car ఒక్కటి కూడా వెళ్లలేదు. మరో ఇద్దరు పిల్లలు కిడ్నాప్ అనే విషయం అంతా అవాస్తవం. కేవలం తల్లిని వదిలి హాస్టల్ కి వెళ్లడం ఇష్టం లేక భయంతో చెప్పిన అబద్ధం. అని ఎస్​ఐ వివరాలు వెల్లడించారు. మరెవరూ ఇలా తల్లిదండ్రులను మోసం చేయాలని, కావాలని అబద్ధాలు చెప్పొద్దని, సీరియస్​ యాక్షన్​ తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement