Thursday, November 21, 2024

వారికి ఇంటివ‌ద్దే బూస్ట‌ర్ టీకా – జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్

రాష్ట్రంలో అర్హ‌త క‌లిగిన ప్ర‌తీ వ్య‌క్తి క‌రోనా టీకాలు తీసుకునే విధంగా వైద్యారోగ్య‌శాఖ చ‌ర్య‌లు చేప‌ట్టింది. వ్యాక్సినేష‌న్ పై మంత్రులు కేటీఆర్, హ‌రీష్ రావులు జీహెచ్ ఎంసీ అధికారుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల ఆదేశాల‌తో 60ఏళ్ళ‌కు పైబ‌డి, దీర్ఘ
కాలిక వ్యాధులు ఉన్నవారి ఇంటి వద్దకే వెళ్లి బూస్టర్ డోసు వేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. దీని కోసం జీహెచ్ఎంసీ ఒక హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఒకటి కన్నా ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు, ఇతర కారణాలతో బూస్టర్ డోస్ వేసుకోని వారు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 040-21111111 కు ఫోన్ చేయాలన్నారు. ఈ నిర్ణయంతో టీకా సెంటర్ కి రాలేని వారికి ఉపశమనం కలుగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement