హైదరాబాదులోని చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద బాంబు కలకలం చెలరేగింది. చార్మినార్ దగ్గర బాంబు పెట్టామని గుర్తు తెలియని ఆగంతకులు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం బాంబ్ స్క్వాడ్ తో చార్మినార్ వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఫుట్ పాత్ వ్యాపారులను ఖాళీ చేయించి బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తనిఖీల అనంతరం బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ నిర్ధారణకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఫేక్ కాల్ గా నిర్ధారించిన పోలీసులు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేపట్టారు. అది ఆకతాయిల కాల్ అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement