ఓగుర్తు తెలియని వ్యక్తి నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు, సీఐఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌తో ఎయిర్‌పోర్టును క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ప్రయాణికులను కూడా తనిఖీలు చేసిన అనంతరం అది ఫేక్ కాల్‌గా పోలీసులు నిర్ధారించారు. ఎయిర్‌పోర్టు కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం తెల్లవారుజామున 3:50 గంటలకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గంట పాటు ఎయిర్‌పోర్టు పరిసరాలు, టర్మినల్ బిల్డింగ్స్‌తో పాటు అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement