Thursday, November 21, 2024

ప‌రాజ‌యాల బాట‌లో బాలీవుడ్ రీమేక్స్..

రీమేక్‌ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుందని నమ్ముతారు. అందుకే ఒక భాషలో హిట్‌ అయిన సినిమాను మరో భాషలో పునర్మిస్తుంటారు. ఇలా ప్రతి భాషలో జరుగుతుంటుంది. దాదాపు ప్రతి హీరో రీమేక్‌ సినిమాల్లో నటించినవారే. రీమేక్‌తో విజయాలు అందుకుని స్టార్‌డమ్‌ నిలుపుకున్నవారున్నారు. అలాగే ఎంతో నమ్మకంతో రీమేక్‌ చేసి దెబ్బతిన్న నిర్మాణ సంస్థలున్నాయి.
తెలుగులో రీమేక్‌ సినిమాలు ఎక్కువనే విషయం తెలిసిందే. నేరుగా తెలుగు కథలతో తీసిన సినిమాలు సైతం బాక్సాఫీస్‌ విజయం పొందాయి. దాంతో మన తెలుగు సినిమాలను హిందీలో రీమేక్‌ చేయడం కోసం హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో జిత్‌ంద్ర, మిథున్‌ చక్రవర్తి, ధర్మేంద్ర, రాజేష్‌ ఖన్నా వంటి బాలీవుడ్‌ హీరోలు తెలుగు రీమేక్‌ సినిమాలు చేసేవారనే విషయం తెలిసిందే.
కొంతకాలంగా బాలీవుడ్‌లో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. దాదాపు రెండేళ్లుగా వారికి విజయమే దక్కలేదు. అదేసమయంలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు విజయం పొందసాగాయి. దీన్ని గ్రహించిన బాలీవుడ్‌ నిర్మాతలు వీటి హక్కులు తీసుకుని హిందీలో పునర్మించారు. కొన్ని సినిమాలు ఆశించిన విజయం పొందాయి. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయిందనే మాట వినిపిస్తోంది. హిందీలో తీస్తున్న రీమేక్‌ సినిమాలకు ప్రతికూల ఫలితం వస్తోంది. దానికి తాజాగా విడుదలైన సినిమాలను ఉదాహారణగా చెప్పవచ్చు.
తెలుగులో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన అల వైకుంఠపురములో సినిమాను హిందీలో సెహజాదా పేరుతో రీమేక్‌ చేశారు. కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. కథలో చేసిన మార్పుల వల్ల సినిమా ఆకట్టుకోలేకపోయిందని అంటారు.
ఇదేలా ఉంటే ఈ మధ్యకాలంలో నిర్మాత దిల్‌ రాజు కూడా హిందీలోకి ఎంట్రీ- ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా సితార ఎంట్టంన్మెంట్స్‌ నాగవంశీతో కలిసి నాని జెర్సీ సినిమాని హిందీలో రీమేక్‌ చేశారు. అది కాస్త డిజాస్టర్‌ అయింది. తర్వాత తెలుగులో హిట్‌ అయిన హిట్‌ మూవీని హిందీలో రాజ్‌ కుమార్‌ రావు హీరోగా శైలేష్‌ కోలను దర్శకత్వంలోనే రీమేక్‌ చేశారు. అయితే అక్కడ ఆ మూవీ డిజాస్టర్‌ టాక్‌ సొంతం చేసుకుంది.
తమిళ సినిమా విక్రమ్‌ వేదను కూడా బాలీవుడ్‌ లో రీమేక్‌ చేశారు. బాలీవుడ్‌ లో హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రధారులు. కానీ సినిమా ఆకట్టుకోలేకపోయింది.
తాజాగా మలయాళ హిట్‌ సినిమా ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ చిత్రాన్ని అక్షయ్‌ కుమార్‌తో సెల్ఫీ పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమా కూడా దారుణమైన ఫలితం చూసింది. అ క్షయ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌ అని అంటున్నారు.
ఇంతకు ముందు దిల్‌ రాజు భాగస్వామిగా జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేసినా ఆశించిన ఫలితం రాలేదు.
దీనిని బట్టి అన్ని తెలుగు కథలు, సౌత్‌ కథలు హిందీ లో సక్సెస్‌ కావనే విషయాన్ని నిర్మాతలు అర్థం చేసుకోవాలి అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. హిందీలో సక్సెస్‌ కావాలంటే కచ్చితంగా ఒరిజినల్‌ కథలతో సినిమాలు చేస్తే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది. షారూఖ్‌ ఖాన్‌ నటించిన పఠాన్‌ చిత్రం సంచ లన విజయం సాధించడంతో బాలీవుడ్‌లో మళ్లిd ఉత్సా హం కనిపిస్తోంది. ఒరిజినల్‌ కథలకు మళ్లిd డిమాండ్‌ పెరిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement