వివాదాలకి కేంద్ర బిందువు బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్..ఆమె చేసే వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు మరోసారి కంగనా వార్తల్లోకి ఎక్కింది. ఒకవేళ తనను అరెస్ట్ చేసేందుకు వస్తే ఇంటి దగ్గర నా మూడ్ ఇలా ఉంటుందని ఒక ఫొటోని పోస్ట్ చేసింది. చేతిలో మద్యం గ్లాసు పట్టుకుని గతంలో దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. అసలు విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో సిక్కులపై.. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమెపై పోలీసు కేసు కూడా నమోదయింది.
రైతుల తీరును ఆమె ఖలిస్థానీ ఉద్యమం అంటారని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై సబ్ అర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్లో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేసింది. సిక్కులపై ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వస్తోంది. ఈ సమయంలో కంగనా మరోసారి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దాంతో పలువురు ఆమెపై మండిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..