ఇప్పుడంతా ఫ్యాషన్ ప్రపంచం. ఫాష్ గా కనిపించేందుకు ఎంతో ఉబలాటపడుతుంటారు జనాలు. నేటి కాలంలో వృద్ధ్యాప ఛాయలు, తెల్ల జుట్టు త్వరగానే వచ్చేస్తున్నాయి. దాంతో నేటి యువత ఎంతో కుంగిపోతుంది. అయితే జుట్టు తెల్లబడినంతమాత్రాన జీవితం ముగియలేదని నిరూపించిందో మహిళ. జుట్టు తెల్లబడితే తప్పేంటి అంటూ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయింది. వివరాల్లోకి వెళ్తే ..
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్‌జోషి కుమార్తె నియతికి ఇటీవలే పెళ్లైంది. తన ముద్దుల కుమార్తె ఫొటోలను దిలీప్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తెల్ల జుట్టుతో పెళ్లి పీటలు ఎక్కి అందరిని ఆశ్చర్యపరిచిన నియతి.ఆత్మవిశ్వాసానికి మించిన అందం లేదని నిరూపించిందామె. దాంతో సోషల్ మీడియాలో నియతికి అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. జుట్టు తెల్లబడితే అదేం నేరం కాదని చెబుతోంది నియతి. కాగా ఆమె ధైర్యానికి హాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు. ఈమె పలువురికి ఆదర్శప్రాయమని కొనియాడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..