Sunday, November 24, 2024

Immersion | గంగ‌మ్మచెంత‌కు బొజ్జ గ‌ణ‌ప‌య్య‌.. నేడు మ‌హా నిమ‌జ్జ‌నోత్స‌వం!

శోభాయాత్రకు ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ అయ్యాడు. భారీ టస్కర్ మీద‌కు శ్రీ దశ మహ విద్య గణపతిని చేర్చారు. దీంతో హైద‌రాబాద్‌లో నిమ‌జ్జ‌నోత్స‌వం ప్రారంభ‌మ‌య్యింది. ఒక్క‌సారిగా న‌లు మూల‌ల నుంచి గ‌ణ‌ప‌తి విగ్ర‌హాలు ట్యాంక్ బండ్ వైపు వ‌స్తుండ‌డంతో ప్ర‌త్యేక శోభ సంత‌రించుకుంది. అదే క్ర‌మంలో ట్రాఫిక్ జామ్‌తో చాలామంది ఇబ్బందులు ప‌డుతున్నారు..

కాగా, నవరాత్రులు పూజలందుకున్న బొజ్జ గ‌ణ‌ప‌య్య‌ గంగమ్మ ఒడికి తరలుతున్నాడు. హైదరాబాద్‌ నలుమూలల నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు గ‌ణేశుడి విగ్ర‌హాలు క‌ద‌లి వ‌స్తున్నాయి. ఈ సారి తెల్లవారుజాము నుంచే నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌కు వినాయకులను తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్‌ నుంచి అబిడ్స్‌ వరకు గణేశుడి వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పాతబస్తీ, సికింద్రాబాద్‌ నుంచి వినాయక విగ్రహాలు త‌ర‌లివ‌స్తుండ‌డంతో ట్రాఫిక్ అంత‌రాయం క‌లిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement