తెలంగాణ వడ్లు కొంటరో లేదో తేల్చకునేందుకు సీఎం కేసీఆర్ ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్రంతో మాట్లాడి ఫైనల్ డిసిషన్ ఏంటో తెలుసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు గురించి ఎన్నిసార్లు అడిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదన్నారు.
దీంతో చివరి ప్రయత్నంగా ఢిల్లీకి వెళ్తున్నామని కేసీఆర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను, అధికారులను కలుస్తామన్నారు.