బాయిల్డ్ రైస్‌ను ఇతర దేశాలకు నేరుగా ఎగుమతి చేసే అధికారం కేంద్రానికి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… బాయిల్డ్ రైస్ ఎవరూ ఉపయోగించరన్నారు. పిల్లలు కూడా బాయిల్డ్ రైస్ తినడం లేదన్నారు. ఆయా రాష్టాలు ఉత్పత్తి తగ్గించాయని, 3400 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ కోసం 2014లో కేంద్రం ఖర్చు చేసిందన్నారు. రూ.26,600 కోట్లు గత ఏడాది ఖర్చు పెట్టామన్నారు. బాయిల్డ్ రైస్ వేర్ హౌసెస్ లో నిల్వ ఉంటున్నాయన్నారు. రా రైస్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. బాయిల్డ్ రైస్ కు ఆదరణ లేదన్నారు. ఆరేళ్లుగా రైస్ మిగిలిపోతోందన్నారు. 2 లక్షల 60 వేల కోట్ల విలువైన బియ్యం ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. దేశంలో రా రైస్ స్టాక్ పేరుకుపోయిందన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య గొడవలకు హుజురాబాద్ ఎన్నికలే కారణమని స్పష్టం చేశారు. రష్యా యుద్ధంతో ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. పంజాబ్‌లో తమ తప్పిదం వల్లే ఓటమికి గురయ్యామన్నారు.
బాయిల్డ్ రైస్ ఇతర దేశాలకు ఎగుమతి చేసే అధికారం లేదు : కిషన్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement