ఘనాకి పశ్చిమ దిశలోని బోగోర్ సిటీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17మంది మరణించారు. దాంతో పోలీసులు, వైద్య బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని హాస్పటల్ కి తరలించారు. గోల్డ్ మైన్ కి పేలుడు పదార్థాలను తీసుకు వెళ్తోన్న సమయంలో ట్రక్క్ ని టూ వీలర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో మొదట ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి. అవి ట్రక్కును అంటుకున్నాయి మంటల వ్యాప్తితో భారీ ఎత్తున పేలుడు సంభవించింది.
పేలుడు ధాటికి సమీపంలోని వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. అయితే ఎంత మంది చనిపోయారు అనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా చెప్పనప్పటికీ… స్థానిక మీడియా పేర్కొంది. పేలుడు సంభవించిన తర్వాతి దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయమని, దురదృష్టకరమైనదని ఆ దేశ అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడి గనుల్లో వేలాదిమంది కార్మికులు పని చేస్తుంటారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..