Friday, November 22, 2024

గుర్రానికి బాడీగార్డ్..నెల‌కి రూ.50వేల ఖ‌ర్చు..ఏంటా క‌థ‌..

పెంపుడు జంతువులు..జంతు ప్రేమికులు కుక్క‌లు,పిల్లులే కాదు ప‌లు మూగ‌జీవాల‌ను చేర‌దీసి వాటి ఆల‌నా పాల‌నా చూస్తుంటారు. వాటి కోసం ఎంతో ఖ‌ర్చుని కూడా పెడుతుంటారు. సెల‌బ్రిటీల ఇళ్ళ‌ల్లో ప‌లు ర‌కాల మూగ‌జీవాలు సంద‌డి చేస్తుంటాయి. అయితే తాను ఎంతో అపురూపంగా పెంచుకుంటోన్న గుర్రానికి కోటి రూపాయ‌లు ఇస్తామ‌న్నా స‌సేమిరా అంటున్నాడు ఓ వ్య‌క్తి. అంతేకాదండోయ్ …ఈ గుర్రం కోసం 24 గంటలు ఒక బాడీగార్డ్ ఉంటాడని, గుర్రం ఆహారానికి నెలకు రూ.50 వేలు ఖర్చు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మ‌రి ఆ క‌థేంటో చూద్దాం.. రాజస్థాన్‌లో ఇంటర్నేషనల్ పుష్కర్ ఫెయిర్ జరుగుతోంది. ఈ పుష్కర్ ఫెయిర్‌లో ప్రదర్శించేందుకు అనేక గుర్రాలను, మేలుజాతి పశువులను తీసుకొస్తారు. నచ్చిన వాటికి ఎంత ధర అయినా ఇచ్చి కొనుగోలు చేస్తుంటారు.

ఇక ఈ పుష్కర్ ఫెయిర్‌లో పంజాబ్‌లోని బరిండా నుంచి అల్భక్ష్ జాతి గుర్రం సందడి చేసింది. పొడవైన కాళ్లు, బలమైన శరీరం, అందమైన రూపంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ గుర్రాన్ని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. కొంతమంది కోటికి పైగా ఇస్తామని ముందుకు వచ్చారు. ఎంత డబ్బు ఇచ్చినా ఆ గుర్రాన్ని ఎవరికీ అమ్మబోనని దాని యజమాని సందీప్ సింగ్ పేర్కొన్నారు. అల్భక్ష్ ఇంట్లో కుటుంబసభ్యునిగా మారిపోయిందని, ఎంత ఇచ్చినా ఇచ్చేది లేదని తెలిపారు. పుష్కర్ ఫెయిర్‌కు తీసుకురావాలని అనుకున్నానని, తీసుకొచ్చానని ఆయన తెలిపారు. ఇలాంటి గుర్రాలను రాజులు యుద్దాల కోసం వినియోగించేవారని, ఎంత దూరమైన అలుపు లేకుండా పరుగులు తీస్తుంటాయట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement