– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
మంగళవారం ఉదయం పంజాబ్ రాష్ట్రం జలంధర్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఓ ఎర్రటి సూట్‌కేస్‌ను ఓ బాటసారి గమనించాడు. చాలాసేపటి నుంచి ఆ సూట్‌కేసును ఎవరూ తీసుకెళ్లకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది. సూట్‌కేస్‌ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో దగ్గరికి వెళ్లి చూశాడు. దానిలో నుంచి కాలు బయటికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని రైల్వే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.
ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసు బృందం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ డెడ్‌బాడీ ఎవరిది, అక్కడ ఎవరు పడేశారన్న విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.