Friday, November 22, 2024

బోధన్‌లో శివాజీ విగ్రహ వివాదం.. నేడు బంద్ తో పోలీసులు అప్రమత్తం

నిజామాబాద్ జిల్లా బోధన్ లో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ పిలుపునిచ్చి బోధన్ బంద్ కొనసాగుతోంది. బంద్ ను విజయవంతం చేయాలని బిజెపి పార్టీ శ్రేణులను కోరింది. బంద్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైయ్యారు. బోధన్ పట్టణంలో భారీగా పోలీసులను మోహరించారు. బోధన్‌లో శివాజీ విగ్రహాన్ని తొలగించేందుకు టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కార్యకర్తలు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగానికి నిరసనగా సోమవారం బోధన్‌లో బీజేపీ నిజామాబాద్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ పార్టీ రాత్రికి రాత్రే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఘర్షణకు కారణమైంది. బోధన్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో శనివారం(మార్చి 19) రాత్రి ఓ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన ఓ వర్గం వారు.. విగ్రహాన్ని తొలగించాలంటూ అంబేడ్కర్‌ చౌరస్తాలో బైఠాయించారు. దీంతో మరో వర్గం వారు కూడా వందలాదిగా అక్కడికి వచ్చారు. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం రాళ్ల దాడికి దారి తీసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్‌ తీర్మానం ఉందని, విగ్రహాన్ని తొలగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇరు వర్గాలు ఎదురెదురుగా టెంట్లు వేసుకుని ఆందోళనకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  ఏసీ పీ రామారావు ఇరువర్గాలను సముదాయించేందు కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  నినాదా లు చేస్తూ ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.  

ఈ క్రమంలో ఆందోళనకారులు వేసుకున్న టెంట్‌ను పోలీసులు తొలగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. సీపీ లాఠీచార్జికి ఆదేశించడంతో ప్రత్యేక బలగాలు లాఠీలు ఝళిపించాయి. బాష్పవాయువును ప్రయోగించారు. పోలీసుల దెబ్బలకు ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోగా అతడిని ఆస్పత్రికి తరలించారు.

బోధన్‌ ఠాణా ఎదుట బైఠాయించిన వారిపైనా పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఈ సంఘటనపై బీజేపీ సోమవారం బోధన్‌ బంద్‌ కు పిలుపునిచ్చింది. బోధన్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు ఆదివారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ లేఖ రాశారు.  కాగా, ఈ ఘటనపై హోంమంత్రి, రాష్ట్ర డీజీపీ ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement