Tuesday, November 19, 2024

Luxary Bikes: టూరింగ్ అండ్ రైడింగ్‌కి బీఎం‌డ‌బ్ల్యూ కొత్త బైక్స్, బైక్ ల‌వ‌ర్స్‌కి ఇక పండుగే!

బీఎండ‌బ్ల్యూ మోటరాడ్ (BMW Motorrad) ఇండియాలో టూరింగ్ రేంజ్ ప్రారంభించింది. ఇందులో K1600 అండ్ K1250 వంటి బైక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. K1600 లైనప్‌లో మూడు బైక్స్ ఉన్నాయి – బాగర్, GTL ఇంకా గ్రాండ్ అమెరికా. ప్రతి బైక్ కొద్దిగా భిన్నంగా రూపొందించారు. అలాగే లగ్జరీ, హైప‌ర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇవే బెస్ట్ బైక్స్ అని చెప్పొచ్చు. ఇక‌.. టూరింగ్ అండ్ రైడింగ్ కోసం కూడా ఇవి ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ బైక్స్ 3 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీతో వస్తున్నాయి. అంతేకాకుండా అదనపు ఖర్చుతో వారంటీని 4, 5 సంవత్సరాల దాకా పొడిగించవచ్చు. కస్టమర్లు సెలెక్ట్ చేసుకునేలా రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీని కూడా కంపెనీ అందిస్తోంది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

1600 B అనేది బ్యాడ్జర్-స్టయిల్ బైక్, ఈ బైక్ సౌకర్యవంతంగా నడపడానికి ఉద్దేశించబడింది. 1600 GTL పర్ఫర్మెంస్ కోసం నిర్మించారు. అయితే 1600 గ్రాండ్ అమెరికా గ్రాండ్ టూరింగ్ కోసం దీన్ని రూపొందించారు. బ్యాగర్ ధర రూ.29.90 లక్షలు, జీటీఎల్ ధర రూ.32 లక్షలు. గ్రాండ్ అమెరికా ధర రూ.33 లక్షలు. ఈ ధరలు అన్ని ఎక్స్-షోరూమ్ వ‌రకు మాత్ర‌మే. ఇంకా వీటి ఆన్‌రోడ్ ప్రైస్ గురించి రాష్ట్రాల వారీగా డిఫ‌రెన్స్ ఉంటుంది.

ఫీచర్లు ఏమున్నయంటే..
ఈ మూడు బైకుల‌ మధ్య చిన్నపాటి తేడాలున్నాయి. వీటిలోని ఫీచర్ల గురించి చెప్పుకోవాలంటే టైప్-సి చార్జింగ్ పోర్ట్, 4కాన్ఫిగర్ ఫేవరెట్ బటన్ క్లస్టర్, LED హెడ్‌ల్యాంప్, హిల్-స్టార్ట్ కంట్రోల్, హీటింగ్ గ్రిప్స్, సైడ్ కేస్, సీట్ హీటింగ్ వంటివే కాకుండా ఇంకా మరిన్నో బెట‌ర్ ఫీచ‌ర్స్‌ ఉన్నాయి. అన్ని బైక్స్ ఇంటిగ్రేటెడ్ మ్యాప్ నావిగేషన్ అండ్ కనెక్టివిటీతో 10.25-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లేతో వ‌స్తున్నాయి. దీనిని ఆడియో సిస్టమ్‌కు కూడా కనెక్ట్ చేసుకుని మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయొచ్చు.

ఇంజిన్ అండ్ పవర్ గురించి..

- Advertisement -

K1600 బాగర్, K1600 గ్రాండ్ అమెరికా అండ్ K 1600 GTL బైక్స్ 1,649 cc, 6-సిలిండర్, ఇన్-లైన్ ఇంజిన్ వంటి ప‌వ‌ర్‌ఫుల్ అంశాలున్నాయి. ఈ ఇంజన్ 6,750rpm వద్ద గరిష్టంగా 160hp శక్తిని ఇంకా 5,250rpm వద్ద 180Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ టార్క్ పవర్ డెలివరీ కోసం నిర్మించారు. దీనికి 6-స్పీడ్ గేర్ ట్రాన్స్‌మిషన్‌ ఇచ్చారు, ఇది షాఫ్ట్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి ప‌వ‌ర్‌ని జ‌న‌రేట్ చేస్తుంది. థ్రోటల్ బై వైర్ టెక్నాలజీ కూడా ఉంది.

బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ ఎట్లుందంటే..

BMW ఆటోమేటిక్ లోడ్ లెవలింగ్ అండ్ డైనమిక్ ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ అడ్జస్ట్‌మెంట్‌తో డైనమిక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్‌ను అందిస్తోంది. మూడు బైక్స్ బ్రేకింగ్ డ్యూటీ ఫోర్-పిస్టన్ కాలిపర్‌లతో పాటు ముందు భాగంలో ట్విన్ 320 mm డిస్క్‌లను అందించారు. ఇక వెనుక భాగంలో టు-పిస్టన్ కాలిపర్‌తో సింగిల్ 320 mm డిస్క్, మూడు రైడింగ్ మోడ్‌లు రెయిన్, రోడ్ అండ్ డైనమిక్ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement