ప్రభన్యూస్ : చైనాలో జిన్ జుయ్, “లేడీ డై” అని పిలువబడే 2000 సంవత్సరాల నాటి పురాతన మమ్మీని కనుగొన్నారు. ప్రస్తుం ఆ మమ్మీ శరీరం ,ఆమెతో పాటు దొరికిన కొన్ని వస్తువులను హునాన్ మ్యూజియం భద్రపరిచారు. ఆమె సమాధి అవశేషాలు, వందలాది విలువైన కళాఖండాలు, పత్రాలతో పాటు చైనాలోని చాంగ్షా హునాన్‌లోని మవాంగ్‌డుయ్ అని పిలువబడే కొండలోపల వీటిని 1968లో కనుగొన్నారు.
చైనీస్ మహిళ యొక్క 2,000 సంవత్సరాల నాటి మమ్మీనీ 21 గ్యాలన్ల తెలియని ఒక్కరకమైన ద్రవంలో భద్రపరచారు. ఇప్పటికీ ఆమె రక్తనరాల్లో రక్తం ఉండటం విశేషం..అంతేకాదండోయ్ ఆమె జుట్టు, అవయవాలు, కనుబొమ్మలు, వెంట్రుకలు సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయట.. ఆమె చర్మం .. కండరాలు మృదువుగా, జీవించి ఉన్న వ్యక్తి లాగే ఉండటం గమనార్హం. ఈ మమ్మీని చూడటానికి హునాన్ మ్యూజియం అంతర్జాతీయ ప్రదర్శనలకు అనుమతించింది. దాంతో జనం ఈ మమ్మీని చూసేందుకు క్యూ కడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital