పాకిస్థాన్ లోని క్వెట్టా నగరంలో జరిగిన బాంబు దాడిలో ముగ్గురు మరణించారు. కాగా మరో 24మంది గాయపడ్డారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ ఆరోగ్య విభాగానికి సంబంధించిన మీడియా కోఆర్డినేటర్ వసీమ్ బేగ్, మృతుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఉన్నట్లు నివేదించారు. నగరంలోని ఫాతిమా జిన్నా రోడ్డులో రద్దీగా ఉండే మార్కెట్‌లో పోలీసు ట్రక్కు సమీపంలో పేలుడు సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది, రెస్క్యూ బృందాలు మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.పోలీసులు బాంబుని నిర్వీర్య చేస్తుండగా బాండ్ పేలింది. దాంతో సమీపంలో పార్క్ చేసిన చాలా వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.. ఒక దుకాణం మంటల్లో దగ్థమయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Advertisement
తాజా వార్తలు
Advertisement