Friday, November 22, 2024

ఇవి తింటే.. బ్లాక్ ఫంగస్ నుంచి కళ్లకు రక్షణ!

దేశమంతా కరోనాతో అల్లాడిపోతుంటే… దానికి బ్లాక్ ఫంగస్ కూడా తోడై కోవిడ్ బాధితులను వెంటాడుతోంది. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల ఈ ఫంగస్ వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు అధికం అవుతున్నాయి. కరోనా వచ్చి తగ్గిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ సమయంలో బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఎక్కువ. ఇది పాతదే అయినప్పటికీ ఈ కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల కరోనా తగ్గినా కూడా బాధితుల్లో బ్లాక్ ఫంగస్ ఉంటుందనే కోణంలో వారిని పరీక్షించాల్సి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.

కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రగా అవ్వడం లేదా నొప్పి రావడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపు వాంతులు, మానసిక సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి. నాలికపై నల్లటి మచ్చలు ఉంటే… వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. ఇది అంటు వ్యాధి కాదు. ఒకరి నుంచి ఇతరులకు సోకదు. వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటే… ఇది మనల్ని ఏమీ చెయ్యలేదు. బ్లాక్ ఫంగస్ అనారోగ్యంతో బాధపడే వాళ్లకే (వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి) సోకుతుంది. బ్లాక్ ఫంగస్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత తగ్గిపోతుంది. దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి ఇది సోకే ప్రమాదం ఉంటుంది. అలాగే, డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్లు వాడే వారికి, ఐసీయూలో ఎక్కువ కాలం ఉండే వారికి ఇది సోకే అవకాశం ఉంది.

 ముక్కు లేదా నోటి ద్వారా బ్లాక్ ఫంగస్ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా బలహీనంగా, ఏమాత్రం ఇమ్యూనిటీ పవర్ లేని వారికి మాత్రమే బ్లాక్ ఫంగస్ నుంచి ముప్పు ఉంటుంది. అయితే, ఈ ఫంగస్ మనిషి శరీరంలోకి వచ్చినా… ముందుగా కంటిపై దాడి చెయ్యకుండా… కంటిని కాపాడుకునే ఆహారం తినడం ద్వారా దాన్ని అడ్డుకోవచ్చు. కళ్లను కాపాడుకోవచ్చు. చేపలు, గుడ్లు, ఆకుకూరలు, పుల్లటి పండ్లు కంటిని కాపాడుతాయి. ముఖ్యంగా సముద్ర చేపలైతే ఇంకా మంచిది. కొవ్వు పట్టి బాగా లావుగా ఉన్న చేపలను తినాలి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కంటిని కాపాడుతాయని నిపుణులు అంటున్నారు. ఉడకబెట్టిన గుడ్లు తింటే పోషకాలు బాగా అందుతాయి. పప్పులు, బద్దలు గింజలు, బాదంపప్పులు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్ , నారింజ, బత్తాయి, కమలా, పప్పర పనస వంటి పండ్లలో సి విటమిన్ ఫుల్లుగా ఉంటుంది. ఇది వ్యాధులు రానివ్వదు. ఫంగస్‌లు, బ్యాక్టీరియాలు దరిచేరకుండా ఆపేస్తుంది. ఇవి వాడటం వల్ల బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు చాలా వరకూ తగ్గిపోతాయని వైద్య నిపుణులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement