Tuesday, November 26, 2024

న‌లుపు వ‌జ్రం – వేలం వేస్తోన్న సోతెబీ సంస్థ‌

వ‌జ్రం దీనికి ఉన్న డిమాండే వేరు. అతి ఖ‌రీదైన వ‌జ్రాలు ఎన్నో ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పింక్, నీలం, ఆకుప‌చ్చ వ‌జ్రాల గురించే తెలుసు. మ‌రి న‌లుపు వ‌జ్రం గురించి ఎవ‌రికైనా తెలుసా. ఇప్పుడు ఆ వ‌జ్రం గురించే తెలుసుకోబోతున్నాం. ఏకంగా న‌క్ష‌త్ర మండ‌లం నుంచి ఊడిప‌డింద‌ట న‌లుపు వ‌జ్రం. ఇప్పుడా వ‌జ్రాన్ని లండ‌న్ లోని సోతెబీ అనే సంస్థ వేలం వేస్తోంది. దాని పేరు నెనిగ్మా. బ‌రువు 555.55 క్యారెట్లు. ఆ వజ్రాన్ని తొలిసారిగా దుబాయ్ లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. 260 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఓ పెద్ద ఉల్క లేదా గ్రహ శకలం భూమిని ఢీకొట్టినప్పుడు ఈ వజ్రం ఏర్పడి ఉంటుందని సోతెబీ వేలం సంస్థ జ్యువెలరీ స్పెషలిస్ట్ సోఫీ స్టీవెన్స్ వెల్ల‌డించారు. ‘‘సహజసిద్ధంగా నలుపు రంగులో వచ్చిన ఇలాంటి వజ్రం చాలా అరుదట‌. వాటి ఉద్భవం ఇప్పటికీ మిస్టరీనే’’ అని సోతెబీ చెప్పారు.

20 ఏళ్ల క్రితం వరకు కూడా ఆ వజ్రాన్ని బయటకు తీసుకురాలేదట‌. ఆ తర్వాత నిపుణులు 55 మొహాలతో వజ్రాన్ని రూపుదిద్దారని పేర్కొంది. శక్తి, రక్షణకు చిహ్నమైన మిడిల్ ఈస్ట్ పామ్ ఆకారంలోనే దీనిని రూపొందించారు. అతిపెద్ద అరుదైన నలుపు వజ్రంగా 2006లో దీనికి గిన్నిస్ రికార్డు కూడా ఉందని సోతెబీ వెల్లడించింది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఈ వజ్రాన్ని.. ఆ తర్వాత లాస్ ఏంజిలిస్, లండన్ లకు తీసుకెళ్లనున్నారు. ఫిబ్రవరి 3న ఆన్ లైన్ లో వేలం నిర్వహించనున్నారు. ఇదో అంతరిక్ష అద్భుతం అని సోతెబీ పేర్కొంటోంది. వేలంలో డబ్బుతో పాటు క్రిప్టోకరెన్సీనీ తీసుకుంటామని చెప్పింది. కాగా, వేలంలో ఈ వజ్రానికి కనీసం 50 లక్షల డాలర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మ‌రి ఈ వ‌జ్రాన్ని ఎవ‌రు సొంతం చేసుకోనున్నారో, ఎంత ధ‌ర‌కి కొనుగోలు చేయ‌నున్నారో అనే విష‌యాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. చూద్దాం ఈ న‌ల్ల‌టి వ్ర‌జం ఎవ‌రి సొంత కానుందో.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement