ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఢిల్లీ సీఎం కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ ప్రమేయం ఉన్నట్లు, ఆయన పేరును ఈడీ చార్జిషీటులో చేర్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే ఈడీ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. ఈ స్కాం ద్వారా వచ్చిన అక్రమ నిధులను కేజ్రీవాల్ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నట్లు ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పేరు చార్జిషీటులో ఉన్నందువల్ల ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక ముఖ్యమంత్రి పేరు చార్జిషీటులో ఉండటమంటే మామూలు విషయం కాదని, కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ఈ ఒక్క కారణం చాలని బీజేపీ నేతలు అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement