ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దూకుడుమీదున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఫోన్ కాల్ లైవ్‌లో మాట్లాడిన తుషార్‌కు తొలుత నోటీసులు జారీ చేశారు. కాగా, ఇవ్వాల (శుక్రవారం) మరో ముఖ్య నేత బీఎల్ సంతోష్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా తెలంగాణలోని ఓ బీజేపీ నేత బంధువు అయిన అడ్వొకేట్‌కు కూడా నోటీసులు అందాయి. ఇక కేరళకు చెందిన మరో స్వామీజీకి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది…
అయితే.. ఈ కేసులో బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్, తుషార్, శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులను నిలుపుదల చేయాలని కోరుతూ బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఇంతకుముందే ఇదే కేసులో బీజేపీ నేతలు సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టు వెళ్లగా కోర్టు వారి పిటిషన్‌ని కొట్టేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు చేయడం వల్ల ఏమిటి ప్రాబ్లమ్ అంటూ మందలించింది. ఇక.. మరోసారి ఈ విషయంపై హైకోర్టు ఏం చెబుతుందో వేచి చూడాలి..