హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడడటంతో బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించాలని కాషాయ దళం నిర్ణయించింది. ఈ క్రమంలో అక్టోబర్ 2న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ముందుగా హుజూరాబాద్‌లో ముగింపు సభ నిర్వహించాలనుకున్నా.. షెడ్యూల్ వెలువడటంతో హుస్నాబాద్ కు మార్చారు.
ఏడేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర తుది దశకు చేరుకుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి బండిసంజయ్ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. తొలిదశ పాదయాత్ర విజయవంతంపై ప్రజలకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలపనున్నారు. హుస్నాబాద్‌లో నిర్వహించనున్న సభను విజయవంతం చేసి తమ సత్తా చాటాలని కమల దళం ప్రణాళిక రచిస్తోంది.
ఇది కూడా చదవండి: బీజేపీలో చేరికపై మాజీ సీఎం అమరీందర్ కీలక వ్యాఖ్య