Friday, November 22, 2024

ఎన్నిక‌ల‌లో బిజెపి వ్యూహం – 65 మంది సిట్టింగ్ ల‌కు టిక్కెట్ క‌ట్

2024 లోక్‌సభ ఎన్నికలపై రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ‘ఇండియా’ పేరుతో రెఢీ అవుతోంది. అధికార బీజేపీ పదేళ్ల ఎన్డీఏ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తోంది. అంతేగాక ప్రస్తుత అధికార బీజేపీ ఎంపీల పనితీరుపైనా రిపోర్ట్‌ కార్డు తయారు చేసింది. ఇందులో 65 మంది ఎంపీల పనితీరు సరిగ్గా లేదని తేలింది. ఇందులో అత్యధికులు ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వారే ఉన్నట్లు సమాచారం. ఆయా స్థానాల్లో కొత్త వారికి అవకాశమిస్తామని సంకేతాలిచ్చారు. గతంలోకంటే ఈసారి మరో 30 సీట్లు అధికంగా గెలుచుకోవాలనే లక్ష్యంతో కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా పలువురు సిట్టింగ్‌లకు టికెట్‌ నిరాకరించి, కొత్తవారిని బరిలోకి దింపి సత్ఫలితాలు రాబట్టింది. అదేబాటలో ఈసారి కూడా కొత్తవారిని ప్రయోగం చేయాలని కమలదళం యోచిస్తోంది.

న్యూఢిల్లీ – 2024లో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా బీజేపీ తన సన్నాహకా లను తీవ్రతరం చేసింది. ఇండియా పేరిట విపక్షాలు ఒక కూటమి కట్టడంతో దేశవ్యాప్తంగా తన సిట్టింగ్‌ ఎంపీల బలాబలాలను బేరీజు వేసే పనిలో పడింది. తద్వారా మరోసారి గెలుపు సాధించే వారిని గుర్తించ డంలో తలమునకలై ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం బీజేపీకి లోక్‌సభలో 301 మంది సభ్యులున్నప్పటికీ వారి లో 65 మంది ఎంపీల పనితీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేద నే మాట పార్టీ అధినాయ క త్వం పరిసరాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేకతను నివారించడం కోసం సదరు 65 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తు న్న లోక్‌సభ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను మార్చాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. వారిలో కొందరిని వేరే నియోజకవర్గాల్లో నిలబెట్టే అవకాశం ఉంది.

వైఖరి, పనితీరు మారితేనే టిక్కెట్‌
కేంద్రంలో మోడీ సర్కారు తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 30 నుంచి జూన్‌ 30వరకు ప్రజల వద్దకు చేరుకునే ప్రత్యేక కార్యక్రమాలను బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టింది. పార్టీకి చెందిన ఎంపీలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ కొందరు ఎంపీలు ఈ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనలేదు. దీనిపై పార్టీ చీఫ్‌ జేపీ నడ్డా వారిని మందలించినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ సైతం వారి పట్ల తన అసంతు ష్టిని వ్యక్తం చేసారు. సదరు ఎంపీలు వారి ప్రవర్తన మార్చుకోని పక్షంలో వారి స్థానంలో వేరొకరు వస్తారని హెచ్చ రించారు. ఇటీవలి కాలంలో టిఫిన్‌ సమావేశాలతో పాటుగా అనేక కీలకమైన ప్రచార కార్యక్రమాలను బీజేపీ చేపట్టినప్పటికీ సదరు కార్యక్ర మాలకు పార్టీ అంచనాలకు తగ్గట్టుగా ప్రజలను కూడగట్టడంలో అనేక మంది ఎంపీలు విఫలమైనారు.

యూపీలో సిట్టింగ్‌ ఎంపీలకు హెచ్చరిక
ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక కేంద్ర మాజీ మంత్రి తన పనితీరును మెరుగుపరుచుకోని పక్షంలో ఈసారి ఆయనకు టిక్కెట్‌ వచ్చే అవకాశం లేదని బీజేపీ వర్గాలు తెలిపా యి. పార్టీ పట్ల వైఖరిని మార్చుకుంటేనే టిక్కెట్‌ దక్కుతుందని ఒక పేరొందిన కుటుంబంతో సంబంధం ఉన్న మరో ఎంపీకి అధిష్టానం హెచ్చరించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద పెద్ద నేతలను ఓడించిన అనేక మందిని ఎంపీలను వారి నియోజకవర్గాలకు తరచుగా వెళుతుం డాలని, స్థానిక నేతలతో సమన్వయం చేసుకోవాలని, ప్రజలతో మమేకం కావాలని ఆదేశించింది.

బీహార్‌లో టార్గెట్‌ 40 సీట్లు
బీహార్‌లో వివాదాస్పద ప్రకటనలకు పేరొందిన ఒక కేంద్ర మంత్రికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం సదరు కేంద్ర మంత్రి వచ్చే ఎన్నికల్లో వేరే నియోజకవర్గం నుంచి నిలబడతానని పార్టీ అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. పార్టీ టిక్కెట్లు దక్కే అవకాశం లేని వారి జాబితాలో ముగ్గురు కేంద్ర మాజీ మంత్రులు ఉన్నారు. బీహార్‌లో అన్ని 40 సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎంపీలను నిలబెట్టాలా లేక ఇతర రాష్ట్రాల నుంచి పేరొందిన పార్టీ సభ్యులను నిలబెట్టాలా అనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారు.

- Advertisement -

ఢిల్లిdలో ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలకు నో టిక్కెట్‌
ఢిల్లిdలో ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలకు టిక్కెట్‌ ఇవ్వరాదనే నిర్ణయానికి పార్టీ అధిష్టానం వచ్చినట్టు సమాచారం. అదే సమయంలో పార్టీకి చెందిన దివంగత కేంద్ర మాజీ మంత్రి కుటుం బ సభ్యుల్లో ఒకరిని బరిలోకి దించే అవకాశం ఉంది. అలాగే వేరే రాష్ట్రం నుంచి ఒక నేతను ఢిల్లిdలో నిలబెట్టనుంది.

ఉత్తరాదిన చాలా మందికి మొండి చెయ్యి
హర్యానాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను మార్చే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. హర్యానాతో ఆగిపోకుండా మధ్యప్రదేశ్‌, కర్నాటక, రాజస్థాన్‌, అసోం, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో అనేక మంది సిట్టింగ్‌ ఎంపీలకు టిక్కెట్లు నిరాకరించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.

గుజరాత్‌లో రాజ్యసభ ఎంపీలకు ఛాన్స్‌
గుజరాత్‌లో పార్టీకి చెందిన సీనియర్‌ రాజ్యసభ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల బరిలో దిగడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ అధిష్టానం సైతం సిట్టింగ్‌ ఎంపీలకు కాకుండా రాజ్యసభ ఎంపీలవైపు మొగ్గు చూపిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

వయస్సు మళ్ళిన ఎంపీలకు కష్టం
వయస్సు మీదపడి, నియోజకవర్గాల్లో అంతగా చురుగ్గా పనిచేయని కొందరు ఎంపీలకు ఈసారి టిక్కెట్‌ దక్కడం కష్టమేనని సమాచారం. అదే సమయంలో 2014, 2019 ఎన్నికల్లో ఒకే చోటు నుంచి వరుసగా గెలిచిన ఎంపీలపై బీజేపీ దృష్టి పెట్టింది.
ఎంపీల్లో కొందరు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కించుకోవడానికి పార్టీ సీనియర్లను ఆశ్రయిస్తుండగా, మరికొందరు తమ స్థానాన్ని సుస్థిర పరుచుకోవడానికి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)తో వారికి ఉన్న సంబంధాలను వినియోగించుకుంటున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement