ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్ తో బిజెపి మంతనాలు జరుపుతోందట. అయితే ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. అపర్ణా యాదవ్ 2017ఎలక్షన్స్ లో కంటోన్మెంట్ సీటు నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో బిజెపి అభ్యర్థి రీతా బహుగుణ చేతిలో 33,976ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో తనకు లక్నో కంటోన్మెట్ టికెట్ ఇచ్చేట్టు అయితే బీజేపీలో చేరి పోటీ చేయాలని అపర్ణా యాదవ్ భావిస్తున్నారు.
కాకపోతే ఆమెను గతంలో పోటీ చేసిన చోట కాకుండా, వేరే స్థానం నుంచి రంగంలోకి దింపాలని బిజెపి ఆలోచన. మరి ఏమవుతుందో చూడాలి. కాగా బిజెపి నేతలను ఆకర్షించేందుకు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఒకవైపు ప్రయత్నిస్తుంటే.. ఆయనకు చెక్ పెట్టేందుకు బిజెపి పోటీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలను అఖిలేశ్ ఎస్పీలో చేర్చుకున్నారు. అటు బీజేపీ కూడా ఎస్పీ నుంచి ఇక ఎమ్మెల్యేకు ఇప్పటికే పార్టీ కండువా కప్పింది. ఇప్పుడు ఏకంగా ములాయం సింగ్ యాదవ్ ఇంటి సభ్యురాలినే తమ పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోందన్నది తాజా సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..