అస్సాం ముఖ్యమంత్రి మాటల వెనుక ప్రధాని మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ఉన్నారని విశ్వసిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ప్రత్యేక హోదా, రాయలసీమ ఉత్తరాంధ్రకు నిధుల అంశం అజెండాలో పొరపాటున చేర్చారు. తొలగిస్తున్నారు అన్న సమాచారం మాకు ముందే ఉంది. ఆ రెండు అంశాలను అజెండాలో పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ ఒత్తిడి తేవాలన్నారు. ఎంపీలు అంత మంది ఉన్నప్పటికీ , ఈ ప్రభుత్వానికి కేంద్రాన్ని అడిగే దమ్ము లేదన్నారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీచంగా విమర్శలు చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో చెప్పుకోడానికి ఏమి లేక కాంగ్రెస్ పై బిజెపి విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పైన.. రాహుల్ గాంధీ కుటుంబం పైన విమర్శించే స్థాయి బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు లేదన్నారు.
రాహుల్ గాంధీని విమర్శించే హక్కు బిజెపి, ఆర్ ఎస్ ఎస్ కు లేదు – పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
Advertisement
తాజా వార్తలు
Advertisement