– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
“ఇల్లు లేకపోతే నాకు విలువ ఉండదు. ఇదంతా ఏ నాయకుడూ ఒప్పుకోడు. కానీ నేను చేస్తున్నాను.. (ప్రజల చప్పట్లు). నా కొడుక్కు పెళ్లి చేయాల్సిన అవసరం వచ్చింది. కనీస అవసరాలకు వాడుకున్నాను..కానీ మొన్నటి పనికిరాని ప్రజాప్రతినిధులలా మొత్తం నిధులను స్వాహా చేసినట్టు కాదు’’ అని బీజేపీ ఎంపీ సోయం బాపురావు అందరిముందూ చెబుతున్న ప్రసంగం వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అయితే.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాన్ని వ్యతిరేకించారు సోయం బాపురావు. తాను అవినీతికి పాల్పడ్డట్టు చెప్పిన వాదనను తిరస్కరించారు. BRS నాయకులు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన గురించి అంతా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. సరైన వాస్తవాలు తెలియకుండా తనలాంటి ఆదివాసీ ఎంపీని రోడ్డుపైకి లాగడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.