తెలంగాణ క్యాబినెట్ లో తనకు తెలిసినంతవరకు పనిచేసే మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క ఈటల మాత్రమేనని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈటల ప్రజాదరణ క్రమంగా పెరుగుతుండడంతో ఓర్వలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఈటలపై కక్ష సాధింపుతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఈటలకో న్యాయం… జూపల్లికో న్యాయమా అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ కు అంత చిత్తశుద్ధి ఉంటే మైహోం రామేశ్వరరావు అక్రమాలపై ఎందుకు స్పందించడంలేదని అరవింద్ ప్రశ్నించారు. ఏదేమైనా కేసీఆర్ నీచ రాజకీయాలకు తెరదీశాడని విమర్శించారు. ఈటలపైనే కాకుండా, భూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్, తదితరులపైనా విచారణ జరిపించాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు.