తెలంగాణలో బీజేపీ దూకుడు మీద ఉంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఇటీవల హుజురాబాద్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆపార్టీలో కొత్త జోష్ వచ్చింది. ఇదే ఉపులో తెలంగాణలో అధికారం చేపట్టాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా.. విజయం తమదే అన్న ధీమా బీజేపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకటి రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నికల కోసం బీజేపీ సిద్దంగా ఉందన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా శేరిగూడెం గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఉపఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందన్న రఘునందన్ రావు.. ప్రజల ఆలోచన విధానంలో తేడా వచ్చిందన్నారు. దానికి నిదర్శనమే హుజురాబాద్ ఎన్నికల ఫలితం అని చెప్పారు. అయితే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది అన్నదానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీపైపు చూస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. తెలంగాణలో వరి కోసం పోరు
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily