ధాన్యం కొనకుంటే అధికారం నుంచి కేసీఆర్ తప్పుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ మతి తప్పిన ఆలోచనలతో రైతులు మునిగిపోయారని విమర్శించారు. తమపై కోపాన్ని.. సీఎం కేసీఆర్ అధికారం ఇచ్చిన రైతులపై చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి తప్పులు చేస్తే.. శిక్ష ఎంజీఎం సూపరింటెండెంట్ అనుభవించాలా? అని ప్రశ్నించారు. చేతకాక, చేవలేక ముఖ్యమంత్రి చిల్లర పనులు చేస్తున్నారని మండిపడ్డారు. పెంచిన విద్యుత్, బస్ చార్జీలు నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం సీఎం చేస్తున్నారని ఆరోపించారు. లక్షలాది రైతులు, పౌల్ట్రీ రంగం ఉసురు కేసీఆర్ పోసుకుంటున్నారని ఎమ్మెల్యే ఈటల పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement