Tuesday, November 26, 2024

యూపీలో బిజెపి ఓట‌మి ఖాయం – మాయావ‌తి

ఐదు రాష్ట్రాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్,గోవా,పంజాబ్,మ‌ణిపూర్ ల‌కి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఎన్నిక‌ల షెడ్యూని సీఈసీ సుశీల్ చంద్ర ప‌క్ర‌టించారు. ఈ నేప‌థ్యంలో యూపీలో ఎల‌క్ష‌న్ హ‌డావిడి ప్రారంభ‌మైంది. ఈ మేర‌కు యూపీలో త‌మ‌దే విజ‌య‌మ‌ని ప్ర‌ధాన పార్టీలు ధీమాని వ్య‌క్తం చేస్తున్నాయి. కాగా జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో బీజేపీ ఒడిపోవ‌డం ఖాయ‌మ‌ని బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావ‌తి తెలిపారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా లేదా ఓటింగ్ యంత్రాంగాన్ని తారుమారు చేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని మాయావతి అన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఎన్నికల సంఘం అప్ర‌మ‌త్త‌త.. భయం అవసరం. ఈసీ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి… ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా, ఓటింగ్ యంత్రాలను తారుమారు చేయకుంటే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని జోస్యం చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement