దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించే ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం పంజాబ్ మినహా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో బీజేపీదే విజయమని అంచనా వేశాయి. తాజా సరలి చూస్తే ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ అధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 155 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఎస్పీ కూడా దాదాపు 123 పైచిలుకు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గోరఖ్ పూర్ అర్బన్ లో యూపీ సీఎం యోగి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక పంజాబ్ లో ఆప్ ఆధిక్యంలో ఉంది. అమృత్ సర్ ఈస్ట్ లో కాంగ్రెస్ నేత సిద్దూ ముందంజలో ఉన్నారు. ఇక, గోవాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరా హోరీ కొనసాగుతోంది. పనాజీలో స్వతంత్ర అభ్యర్థి ఉత్పల్ పారికర్ ముందంజలో ఉన్నారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. 2024కి సెమీ ఫైనల్‌గా భావిస్తున్న యూపీలో ఇది అత్యంత కీలకమైన ఎన్నికలు.