Saturday, November 23, 2024

క‌ర్నాట‌క టు తెలంగాణ ….బిజెపి స‌రికొత్త వ్యూహం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో అధికారంలోకి రానిదే దక్షిణాదిపై పట్టు సాధించలమేని ఆ పార్టీ జాతీయనాయకత్వం భావి స్తోంది. దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న ఆ పార్టీ ఇప్పటికే కర్ణాటక, గోవాల్లో అధికారంలో ఉంది. దక్షిణాదికి ముఖద్వారం అయిన తెలంగాణలో అధికారంలోకి వస్తేనే సంపూర్ణంగా దక్షిణ భారతంలో పాగా వేయగలుగుతామని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు ప్రధానంగా దృష్టి సారించారు. ఇదే సమయంలో కర్ణాటకలో ఎన్నికలు రావడంతో అక్కడ అధికారాన్ని తిరిగి నిటబెట్టుకుంటే ఆ రాష్ట్రంతో సరిహద్దును పంచు కుంటున్న తెలంగాణలోనూ అధికారం కైవసం చేసుకోవడం పెద్ద కష్టం కాదని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా తెలంగాణలో తరచూ పర్యటిస్తు న్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత షా టార్గెట్‌ తెలంగాణనని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో మేలో పోలింగ్‌ ముగిసి ఫలితాలు వెలువడిన 4 నెలల్లోనే తెలంగాణలో అసెంబ్లిd ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షా తెలంగాణపై పక్కా వ్యూహాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చాక అవసరమైతే హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని షా ఇక్కడే మకాం వేయనున్నట్లు బీజేపీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పరిస్థిితి, పార్టీ బలాబలాలపై షా తన బృందాలతో రహస్య సర్వేలు కూడా నిర్వహించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రజల మూడ్‌ బీజేపీ వైపు ఉందని ప్రకటించిన విషయం విధితమే.

రానున్న అసెంబ్లి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో భాగంగా ఆయన పర్యటించనున్నట్లు బీజేపీవర్గాలు చెబుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో ఆయన పర్యటన కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమిత్‌ షా పర్యటన సందర్భంగా వికారాబాద్‌లో దాదాపు లక్షకు పైగా మందితో భారీ బహిరంగసభను నిర్వహించాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది.
ఈ నెల 23న అమిత్‌ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. ఈ సభ నిర్వహణ, అమిత్‌ షా పర్యటన విజయవంతం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై తెలంగాణ బీజేపీ పార్లమెంట్‌ కన్వీనర్లు, ప్రబారీలు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జిలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునిల్‌ భన్సల్‌ మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమీక్షించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement