తిరుపతి ఉప ఎన్నిక ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల కావడంతో ఏపీలో ఈ విషయంపై కూడా రాజకీయ దుమారం రేగుతోంది. వకీల్ సాబ్ బెనిఫిట్ షోల టిక్కెట్లు ధరలు పెరగకుండా ఏపీ సర్కారు అడ్డుకోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కారణాల దృష్ట్యానే ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని పవన్ అభిమానులు, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ సినిమాను టార్గెట్ చేసిన వైసీపీకి బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి చేసిన వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో వకీల్ సాబ్ సినిమాకి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని విష్ణు అన్నారు. ఇది వకీల్ సాబ్ సినిమా టికెట్ లకు సంబంధించిన అంశం కాదని, తిరుపతి ఎంపీ టికెట్ కు సంబంధించిన పంచాయతీ అని తెలిపారు. ఈ నెల 3న తిరుపతిలో జరిగిన బీజేపీ, జనసేనల బహిరంగా సభతో వైసీపీలో ఓటమి భయం పట్టుకుందన్నారు. ‘వకీల్‌సాబ్ సినిమా ద్వారా పవన్ కల్యాణ్ కు షాకిస్తే.. ఈ నెల 17న తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, పవన్ అభిమానులు షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి’ అంటూ హెచ్చరించారు.
వకీల్ సాబ్ టార్గెట్.. తిరుపతిలో రివెంజ్!
Advertisement
తాజా వార్తలు
Advertisement