Friday, November 22, 2024

యూపీలో రాష్ట్రపతి పాలన.. ఎన్నికలు వాయిదా?: బాంబు పేల్చిన సుబ్రహ్మణ్య స్వామి

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికలపై ఒమిక్రాన్ ప్రభావం పడే అవకాశం ఉన్నది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఇప్పుడే మొదలు పెడుతున్నాయి. అయితే, దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతా? లేదా వాయిదా పడతాయా? అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.  యూపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందని, అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడబోతున్నాయి సంచలన ప్రకటన చేశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కేంద్రం వాయిదా వేయనుందని చెప్పారు. అలాగే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబర్‌ వరకు వాయిదా పడతాయని తెలిపారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఓ ట్వీట్ చేశారు.

మరోవైపు కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల సూచనలు చేసింది. తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సైతం ఇదేరకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement