Friday, November 22, 2024

పీఆర్సీపై లీకులు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత రామచంద్రరావు. టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పీఆర్సీపై లీకులిచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిపొందిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ డబ్బులను విపరీతంగా పంపిణీ చేసిందన్నారు. దొంగ సర్టిఫికేట్స్‌తో ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించారని చెప్పారు. గూగుల్ పే, పేటీఎంల ద్వారా ఓటర్లకు డబ్బుల పంపిణీ జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలిపారు.

కాగా,  హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ సాగింది. అయితే, టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించారు. రామచంద్రరావు సిట్టింగ్ స్థానాన్ని కొల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement